Latest

Loading...

Public Provident Fund Scheme: రూ.70 పొదుపుతో రూ.6 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే.. ?

Public Provident Fund Scheme

 Public Provident Fund Scheme

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.


ఎలా రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరడం వల్ల పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను సైతం పొందవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలుగా ఉంది.


ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీరేటు అమలవుతుండగా కేంద్ర ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో స్వల్పంగా మార్పు చేసే అవకాశం అయితే ఉంటుంది. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి వడ్డీరేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.


ఈ స్కీమ్ లో రోజుకు 70 రూపాయల చొప్పున నెలకు 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 6 లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల లక్ష్యాలు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందాలని అనుకునే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.


దీర్ఘకాలంగా పొదుపు చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ప్రతి నెలా ఈ స్కీమ్ లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అంత మొత్తం ఇన్వెస్ట్ చేయవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


No comments

Powered by Blogger.