Latest

Loading...

SBI Alert: ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..లేదా..మీ అకౌంట్ ఖాళీ..!

SBI Alert

 దేశీయ అతిపెద్ద బ్యాంక్ SBI తన ఖాతాదారుల కోసం హెచ్చరిక జారీచేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని యాప్స్ ను SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది.


ఒక నాలుగు యాప్స్ లను గురించి SBI ఈ అలర్ట్ జారీచేసినట్లు తెలిపింది. ఎందుకంటే, ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారు.


విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూవర్ మరియు మింగిల్ వ్యూ యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది. అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది.


అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి.

No comments

Powered by Blogger.