Software : ఫ్రెషర్స్ కి శుభవార్త..... ఐటీలో లక్ష ఉద్యోగాలు....!!!
Software : చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి.
ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్, పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్, బైజూస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది.
2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విద్యార్థులకు కాగ్నిజెంట్ 45 వేల ఉద్యోగాలు ఇవ్వనుందని ఈ పత్రిక తెలిపింది. ఇక ఈ ఏడాది ఈ కంపెనీ 30 వేలమంది ఫ్రెషర్స్ కి ఉద్యోగాలిచింది. ఇన్ఫోసిస్ గతంలో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్ ను నియమించనుంది. 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది.
ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్‌ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నాయి దిగ్గజ కంపెనీలు. ఇక ఇదే అంశంపై కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. నైపుణ్యం గల విద్యార్థులకు మార్కెట్లో అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్ పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
దేశంలో ఐటీ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ కంపెనీలే కాకుండా చిన్నపాటి ఐటీ కంపెనీలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక దేశంలోని ఐటీ కంపెనీలు 2022లో సుమారు 2 లక్షల మందిని నియమించుకుంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.
No comments