Latest

Loading...

TS మాంసం దుకాణాలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.....!!!


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించే రీతిలో... వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళితే రాష్ట్ర పశువర్ధక శాఖ... రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.


అంత మాత్రమే కాక రాష్ట్రంలో కబేళాలు ఏర్పాటుకు కూడా.. పశువర్ధక శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర జిల్లాలలో.. ఒకటి లేదా రెండు చొప్పున.. వద్ద శాలలను ఏర్పాటు చేసి వాటిని స్థానిక మాంసం దుకాణాలతో..లింక్ అయ్యేలా.. ప్రణాళికలు పశువర్ధక శాఖ సిద్ధం చేస్తూ ఉంది.


అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రతి జోన్ లో.. ఒక వద్దశాల ఏర్పాటు చేసి వాటికి..సదరు జోన్ పరిధిలో ఉండే షాపు లకి లింక్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్ని మాత్రమే.. మాంసం దుకాణాల్లో అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత మాత్రమే కాక ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే.. మాంసం విక్రయించాల్సి ఉంటుంది. పశువర్ధక శాఖ రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించడానికి.. ఈ రీతిగా వ్యవహరిస్తోంది.

No comments

Powered by Blogger.