Vaccination ఒకసారి టీకా తీసుకుంటే ఏడాది పాటు సేఫ్...!!.
వందశాతం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఏడాది వరకు ఉంటాయని, బూస్టర్ డోసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలో అనేక వ్యాక్సిన్లు ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాడిలా ఫార్మా తయారు చేసిన జైకోవ్ డి మూడో డోసుల వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని, అత్యవసర వినియోగం కిందనే ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, జైకోవ్ డి వ్యాక్సిన్ కు సిరంజితో అవసరం ఉండదని, మూడు డోసుల ధరను త్వరలోనే ప్రకటిస్తారని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు.
No comments