Vastu directions: ఇంటి ఈశాన్యంలో ఈ పూల మొక్కను పెంచితే.... విశేష ధనప్రాప్తి...!!
మనం సాధారణంగా ఇళ్లలో మొక్కలు పెట్టుకుంటాం. అయితే అందులో ముఖ్యంగా పూల మొక్కలకు ప్రాధాన్యతను ఇస్తాం. ఖాళీగా ఉన్న ప్రాంగణంలో వీలైతే.. వేప, ఉసిరి, మారేడు వంటివి పెంచాలని పండితులు చెబుతారు.
కార్తీక మాసం ఈ చెట్లకు విశేష పూజలు చేస్తారు. ఇవి సర్వం మనకు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అందుకే అటువంటి చెట్లు శుభఫలితాన్ని ఇస్తాయి. పనస చెట్టు ఇంట్లో ఉంటే.. సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. ముఖ్యంగా పూల మొక్కల్లో గోవర్థనం వంటివి పెట్టుకోవాలి. సన్నజాజి, మల్లేపూవు, చెట్టు జాజి, ఈ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇంటి ప్రాంగణంలో కృష్ణతులసీ, లక్ష్మీతులసీ రెండు చెట్టు నాటినట్లయితే.. ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. లక్ష్మీదేవికి ఈశాన్య మూలలో పద్మతత్వన్ని విరజిల్లే పుష్పాలను పెంచి, లక్ష్మీదేవికి అర్పిస్తే.. లక్ష్మీకటాక్షం నిత్యం ఆ ఇంటికి ఉంటుంది.
అదేవిధంగా తామర పూసలు లక్ష్మీదేవి పటానికి వేస్తే.. అత్యంత అద్భుతమైన లక్ష్మీ కాటాక్షం లభిస్తుంది. ఆ గింజలతో ఏ ఇంటి యజమాని అయితే, పూజచేస్తాడో లక్ష్మీ కటాక్షిస్తుంది. మోదుగ పూవులను ఇంట్లో పెట్టుకుంటే కృష్ణ పరమాత్ముని లావణ్యంతో కూడిన ఆలోచనతత్వం ఆ ఇంటి యజమానికి కలుగుతుందని అంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటపుడు ఆ మొక్కవైపు చూస్తే.. పరిష్కారం దొరికిపోతుంది. అదేవిధంగా మనీప్లాంట్ ఇంటి లోపల కూడా పెంచుకుంటారు. ప్రతి ఒక్క మనిషి ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశగా నాలుగు అడుగులు వేసి.. పచ్చని చెట్టను చూడాలి అంటారు.
కానీ, ముల్లు, పాలుగారే చెట్లను ఇంటి ప్రాంగణంలో పెట్టుకోకూడదు. కలబందను దక్షిణంవైపు నాటుకుంటే మంచిది. దాన్ని తిప్పి ఇంటి ద్వారానికి గుమ్మడికాయ పైభాగంలో కడితే నార గోష పోతుందని నమ్మకం. మందారపూవును వాయువ్యంలో పెట్టుకుంటే సమస్త దోషాలు పోతాయి. చామంతి పూలు జగన్మాతకు పెట్టి పూజిస్తే.. మంచిది. ఎక్కడ ఏ ఇంట మొక్కల పరిరక్షణ ఉంటుందో ఆ ఇంట పరమేశ్వరుని దయ ఉంటుంది. మరువంతో స్వామిని అర్చిస్తే.. చాలా గొప్ప ఫలితం వస్తుంది.
అలాగే తుమ్మిపూవు కూడా శంకరుడుకి చాలా ఇష్టం. అభిషేకం చేసిన తర్వాత వీటితో అర్చించాలి. తులసీ వనం చేసి.. వాటితో ప్రతిరోజూ విష్ణుమూర్తికి అర్చిస్తే.. అద్భుతమైన యోగం ఆ ఇంటి సొంతం.
No comments