Vigneshwar's favorite modak విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన మోదక్.. ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా......?
విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు..
బియ్యం పిండి-1 కప్పు
నీరు - 1 కప్పు
బెల్లం- 1 కప్పు
కొబ్బెర తురుము - కప్పు
యాలకులు - నాలుగు
నెయ్యి- తగినంత
ఉప్పు- చిటికెడు
డ్రైఫ్రూట్స్- కప్పు
ముందుగా స్టావ్ ఆన్ చేసి ఓ ప్యాన్‌లో ఒక కప్పు నీటిని పోయాలి. అందులోనే చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి, ఒక టీస్పూన్ చక్కెర వేయాలి. నీరు బాగా మరగించాలి. ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసి.. బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఓ పదినిమిషాలు పక్కన పెట్టాలి.
స్టఫింగ్..
ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని అందులో టీస్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మరోకప్పు తురిమిన బెల్లం వేసి కలపాలి. మీడియం ఫ్లేంలో బెల్లం కరిగి దగ్గర పడేవరకు చేయాలి. చివరగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్‌ను వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇంతకు ముందు తయారు చేసుకున్న బియ్యపు పిండిని బాగా ప్రెస్ చేస్తూ.. ఓ 3-4 నిమిషాలు కలపాలి. చేతిని వాటర్‌తో కలిపి తడిపితే బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి.
ఎడమచేతి బొటనవేలుతో మధ్యలో ప్రెస్ చేస్తూ.. గిన్నె షేప్‌లో తయారు చేసుకోవాలి. దానిచుట్టూ మూడువేళ్లతో ప్లీట్స్ పెట్టినట్లు చేసుకోవాలి. అప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్‌ను మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిని పైనుంచి మెల్లిగా ముద్దను దగ్గరగా జరపాలి. అప్పుడు మోదక రెడీ అవుతుంది. ఇప్పుడు వీటిని కానీ ఎదైనా గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీరు తీసుకుని స్టీమింగ్ ప్లేట్లపై నెయ్యిని రుద్ది ఆవిరిపై మోదకాలను ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మోదకాలను బయటకు తీయాలి. వెంటనే కాకుండా ఓ రెండు నిమిషాల తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. అంతే టేస్టీ అయిన మోదకాలు రెడీ.
No comments