Viral: వేప పుల్లలను కూడా అమ్మకానికి పెట్టారుగా... ధర ఎంతో తెలుసా ....?
పూర్వం నుండి పెద్దలు వాడుతున్న, వారి పిల్లలందరికి చెబుతున్న నీతి సూత్రాలు మంచి అలవాట్లను ఇప్పుడు ఎవ్వరూ కూడా ఆచరణలో పెట్టడం లేదు. ఆధునిక సంస్కృతికి అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు
మనము నిద్ర లేచి తోముకునే పళ్ళ నుండి నైట్ పడుకునే ముందు వాడే ఏసీ వరకు అన్నీ వస్తువులు కెమికల్స్ తో తయారయ్యేవి అని తెలిసినా వాడేస్తున్నాము. ఎందుకంటే వాటి పట్ల మనము ఆకర్షితులయ్యాము. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది గ్రామాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉంటుంది. అప్పుడు పళ్ళు తోముకోవడానికి పేస్ట్ లాంటివి వాడకుండా చక్కగా వేప పుల్లతో పళ్ళను శుభ్రపరుచుకునే వాళ్ళము. ఇప్పటికీ ఇదే పద్దతిని పల్లెటూళ్లలో అనుసరిస్తున్నారు.
కానీ పట్టణాల్లో అయితే కాల్గేట్, పెప్సోడెంట్ , డాబర్ అంటూ రకరకాల కంపెనీలు వారు ఇస్తున్న పేస్ట్ లను వాడుతున్నాము. పళ్ళు బలహీనం అవడానికి కారణం అవుతున్నాము. ఇండియాలో ఇలా చేస్తుంటే, విదేశాలలో మాత్రం ఏకంగా అలాంటి వేప పుల్లలను అమ్మడానికి రెడీ అయిపోయారు. అది కూడా ఈ కామర్స్ సైట్ ద్వారా ప్రత్యేక ప్రచారంతో అమ్ముతున్నారు. దాని ఉపయోగాలను వివరిస్తూ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. అమెరికాలో "వేప చెట్టు పొలాలు" అనే సంస్థ ఈ వ్యాపారం చేస్తోందట. వేప పిల్లలను ఒక బాక్స్ లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు.
ఒక్కొక్క బాక్స్ లో 15 నుండి 20 వేప పుల్లలు ఉంటాయి. ఒక డబ్బాను 1825 రూపాయలకు అమ్ముతున్నారు. చూశారా ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా ...? మన దేశ సంస్కృతిని విదేశాలలో చక్కగా ఫాలో అవుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కానీ మనం మాత్రం విదేశాల మందులను వాడి వారిని అభివృద్ధి చేస్తున్నాము. అయితే వేప పిల్లలను అమ్మడం ఇదేమీ మొదటి సారి కాదని హర్షా హొయెంకా అనే అతను ట్విట్టర్ ద్వారా తెలిపారు. కానీ వేప పుల్లకు ఉన్నఆయుర్వేద గుణాలను తెల్సిన విదేశీయులు భారీగా కొనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకనైనా విదేశీ ఉత్పత్తులను విడనాడి మన ఇలాంటి పాతరకపు పద్దతులను వాడండి.
No comments