Latest

Loading...

Vitamin D deficiency విటమిన్-డి లోపం ఉంటే మెమరీ లాస్ వస్తుంది.....!!

Vitamin D deficiency

 విటమిన్-డి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అది మనకి సూర్యకిరణాలు ద్వారా వస్తుంది. విటమిన్ డి క్యాల్షియం, గుండె ఆరోగ్యానికి, మెదడుకి, రోగ నిరోధక శక్తికి, ఎముకలకు చాలా అవసరం.


అంతే కాకుండా విటమిన్ డి హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అదే విధంగా ఆర్థరైటిస్ కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.


స్టడీ ప్రకారం చూసుకున్నట్లయితే విటమిన్ డి లోపం ఉంటే డెమన్షియా పెరుగుతుందని తేలింది. దీనితో రోజువారీ పనులు వంటివి కూడా మర్చిపోతారు అని తెలుస్తోంది. మెమరీ లాస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆహారంలో విటమిన్-డి తప్పక తీసుకోండి. అయితే విటమిన్ డి ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా దొరుకుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి దీని కోసం కూడా ఇప్పుడే చూసేయండి.


పుట్టగొడుగులు: పుట్టగొడుగుల్లో విటమిన్ డి3 ఉంటుంది. అలాగే విటమిన్ బి కూడా ఉంటుంది పైగా కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం మంచిది.

కార్డ్ లివర్ ఆయిల్: ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జాయింట్ పెయిన్స్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్: సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ డి ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. ఇలా విటమిన్-డి ని పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు. తద్వారా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడానికి వీలవుతుంది.

No comments

Powered by Blogger.