Latest

Loading...

Vitamin tablets: ఇమ్యునిటీ కోసం ఆ విటమిన్​ ట్యాబ్లెట్​లు ఇంకా వాడుతున్నారా...? అయితే కొత్త సమస్యలు తెచ్చుకంటున్నట్లే​

Vitamin tablets

 కరోనా(CORONA) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఏడాదిన్నర అయినా ప్రజల్లో దాని తాలూకూ భయం పోనేలేదు. కనీసం పిల్లలను స్కూలుకు పంపాలన్నా భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


అయితే రోగ నిరోధక శక్తి(Immunity) ఉంటే కరోనాను జయించొచ్చని వైద్య నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ప్రపంచం మొత్తం వివిధ రకాల విటమిన్ల మాత్రలు వేసుకోవడం ఎక్కువచేసింది. అదే కోవకు చెందిందే విటమిన్​ డీ(Vitamin D). విటమిన్ ఈ తక్కువగా ఉన్న వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో చాలామంది తమకు తాము సొంతంగా విటమిన్ డి(Vitamin D) ట్యాబ్లెట్లు తీసుకున్నారు. అయితే, విటమిన్ డి లోపం శరీరంపై ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో.. అది ఎక్కువ అయితే కూడా అంతే ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విటమిన్ డి పిల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. అలసటగా ఉండటం, మత్తుగా అనిపించడం, ఒంట్లో బలహీనత రావడం. ఛాతిలో నొప్పిగా అనిపించడం వంటివి విటమిన్ డి లోపాన్ని సూచించే లక్షణాలుగా వైద్య నిపుణులు(Experts) చెబుతున్నారు.


ఎప్పుడు పడితే అప్పుడు విటమిన్ డి పిల్స్(pills) తీసుకోకూడదు. శరీరంలో విటమిన్ డి లెవల్స్ ఎక్కువైనా అనారోగ్యానికి(Unhealthy) దారితీస్తుంది. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ( Vitamin D tablets ) తీసుకునే ముందు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ ( Vitamin D ) ఏ స్థాయిలో ఉన్నాయో అనేది టెస్ట్ చేయించి తెలుసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో మాత్రమే విటమిన్ డి పిల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆపేయాల్సి ఉంటుంది. శరీరం నలుపు ఉన్న వారిలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుందని.. అలాగని వారిలో రోగ నిరోధక శక్తి ( Immunity ) తక్కువగా ఉంటుందని అంచనా వేయలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు(eye site) దెబ్బతినే ప్రమాదం ఉంది. విటమిన్ డి లెవెల్స్ అధికంగా ఉన్న వారిలో కళ్లు తిరగడం, వాంతులు(intoxicated), ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెద్యులు చెబుతున్నారు. అయితే విటమిన్​ డీ కావాలంటే ట్యాబ్లెట్లు కాకుండా ఆహారం రూపంలో తీసుకుంటే బెటర్​.


చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు నుంచి విటమిన్-డి లభిస్తుంది. కాడ్‌చేప కాలేయపు నూనెలో ఎక్కువగా ఉంటుంది. ధాన్యాలు, కూరగాయల్లో ఉన్నప్పటికీ, తక్కువ మోతాదులో లభిస్తుంది. పేగుల నుంచి కాల్షియం శోషణకు, ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్ లవణాలను స్థిరీకరించడానికి విటమిన్-డి అవసరమవుతుంది. పిండాభివృద్ధి, యవ్వన దశల్లో దేహకణాల సంఖ్యను పెంచడానికి ఈ విటమిన్ ఎంతో అవసరం. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణాల వాపును విటమిన్-డి తగ్గిస్తుంది.


No comments

Powered by Blogger.