Walking benefits: రాత్రి భోజనం తర్వాత కచ్ఛితంగా నడక అవసరమా? రాత్రి భోజనం తర్వాత కచ్ఛితంగా నడక అవసరమా...?
మన దైనందిత జీవితంలో నడక అనేది చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా.. సరైన వ్యాయామం exercise కోసం కాస్త సమయం కేటాయించాల్సిందే. ఎందుకంటే ఇది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లకపోయినా.. ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసుకుంటే శరీరం ఎంతో ఫిట్‌గా ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా నడవాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది...
రాత్రి భోజనం చేసిన తర్వాత కాస్త నడవడం వల్ల శరీరంలో ఉండే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
జీవక్రియను పెంచుతుంది..
జీవక్రియను పెంచడానికి రాత్రి భోజనం తర్వాత చేసే నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవక్రియను పెంచడానికి ఇది ఓ సులభమైన మార్గం. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. అలాకాకుండా కాస్త వాకింగ్ చేస్తే.. మీరు నిద్రపోతున్నపుడు ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది...
నైట్ డిన్నర్ తర్వాత చేసే నడక జీర్ణక్రియ (digestion)ను మెరుగుపరుస్తుంది. తద్వారా మీ శరీరంలో ఉంటే విషవాయువులు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో కరోనా వంటి వ్యాధులతో సహ ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రిస్తుంది...
సాధారణంగా మనం తిన్న అరగంటపాటు శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతాయి. అదే రాత్రి భోజనం చేసిన తర్వాత కాస్త నడిస్తే... రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
No comments