YS Jagan: జగన్ కాలుకి గాయం..... ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం....!!!
Jagan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన పర్యటనకు బయలు దేరిన వార్త బయటకు రాగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో పాల్గొన్న కేసీఆర్ మరి కొద్ది గంటలలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. వరుసగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
25న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 26న కేంద్ర హోం శాఖ నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతారు. ధాన్యం కొనుగోలు అంశంపై పీయూష్ గోయల్‌తో కూడా భేటీ అవుతారని సమాచారం. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రల సీఎంల సమావేశంలో జగన్ పాల్గొనబోతున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల వివాదం ముదిరింది. నీళ్లను తరలించుకుపోతున్నారంటూ తెలంగాణ, విద్యుత్ తయారీకి వినియోగిస్తూ సముద్రం పాల్జేస్తున్నారని వాదించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల వాదనలతో జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. విద్యుత్ కోసం వినియోగించిన నీటిని తెలంగాణ వాటాలో వాడుకున్నట్లుగా పరిగణించాలని తాజా ఏపీ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జలశక్తి మంత్రిలో సమావేశం కానుండడం ప్రాధాన్యం ఏర్పడింది.
No comments