Latest

Loading...

Zinc health benefits మన శరీరంలో జింక్‌ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా ....? జింక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!

Zink health benefits

 మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక మనకు రోజూ ఇది చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది


అయితే మన శరీరంలో జింక్‌ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అనేక జీవక్రియలకు జింక్‌ పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్‌ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


జింక్‌ ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. అనేక బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. రోగాల బారిన పడకుండా ఉంటాం.


పురుషులకు జింక్‌ ఎంతగానో మేలు చేస్తుంది. ఇది వారిలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.


కాలిన గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేయడంలో జింక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే వాటిని మానేలా చేసే ఆయింట్‌మెంట్లు, మందుల్లో జింక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే జింక్‌ ఉండే ఆహారాలను తీసుకుంటే త్వరగా గాయాలు, పుండ్లు మానుతాయి.


మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు జింక్‌ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో మొటిమలు తగ్గుతాయి.


శరీరంలో వాపులు ఉన్నవారు జింక్‌ ఉండే ఆహారాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. అందువల్ల జింక్‌ ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటే పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.


జింక్‌ మనకు ఎక్కువగా గుమ్మడికాయ విత్తనాలు, పైన్‌ నట్స్, బాదం పప్పు, చియా విత్తనాలు, నువ్వులు, బ్రెజిల్‌ నట్స్, జీడిపప్పు, అవిసె గింజలు, పాలకూర, రొయ్యలు, అవకాడోలు, చేపలు, పుట్టగొడుగులు వంటి ఆహారాల్లో లభిస్తుంది. అందువల్ల వీటిని తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.


No comments

Powered by Blogger.