కనీస పెన్షన్ రూ.9 వేలుకు డిమాండ్...!
ఇపిఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని పెన్షనర్ల సంఘం జిల్లా నాయకులు యువిఎస్‌ఎన్.వర్మ డిమాండ్‌చేశారు
మల్కాపురంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఇపిఎఫ్ 95 పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనాతో మృతిచెందిన పెన్షనర్లు, లఖింపూర్‌లో అమరులైన రైతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ముగ్గురితో కమిటీ వేసిందని, తీర్పు పెన్షనర్లకు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కె.నూకరాజు, తమ్మారావు, ఎస్.సూర్యారావు పాల్గొన్నారు.
No comments