Latest

Loading...

Andhra Pradesh: 'వైఎస్‌ఆర్‌ ఆసరా' అమలుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్.....ఆ రోజే మహిళల ఖాతాల్లో నగదు జమ....!!

Andhra Pradesh


వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు కానీ..


పథకం కొత్తది కాకపోవటంతో రెండో విడత కార్యక్రమం అమలుకు క్లియరెన్సు ఇచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావటంతో గురువారం ఉదయం ఒంగోలులో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు సభ జరుగుతుందని, లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి మాట్లాడుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.


వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబరు 11న రూ. 6330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబరు నెలలోనే చెల్లించాలని భావించినా..నిధులు కొరత ఉండటంతో ఆసరా రెండో విడత అమలును అక్టోబరు 7కు వాయిదా వేశారు. రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనుండటంతో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ఆలోచన చేస్తే. అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్‌ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని తెలిపారు.

No comments

Powered by Blogger.