Latest

Loading...

AP ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త....!!!

AP CM

 ఏపీ విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ స్వేచ్చ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు సీఎం జగన్.


ప్రభుత్వ విద్యా సంస్థల లో చదువుతున్న కిషోర బాలికలకు సానిటరి నాప్కిన్స్ ను ఈ సందర్భంగా ఉచితంగా అందచేయనుంది ఏపీ ప్రభుత్వం.


నెలకు 10 నాప్కిన్ లు ఇచ్చేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. 7 తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినులకు కార్యక్రమం అమలు చేయనుంది. మెన్సురేషన్ సమయంలో బాలికల హాజరు తగ్గకుండా తీసుకునే చర్యలలో భాగం గా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.


రాష్ట్రప్రభుత్వం, యూనిసెఫ్, వాష్, పి అండ్ జి, సంయుక్త సహకారం తో స్వేచ్ఛ లో భాగంగా ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించనుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ విద్యాసంస్థల లో స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్‌. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


No comments

Powered by Blogger.