Latest

Loading...

Apple Polishing Cloth: ఫోన్ తుడిచే క్లాత్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన యాపిల్.. ధర చూసిన నెటిజన్ల షాక్....ఈఎంఐ ఆప్షన్ కూడా....!!.

 

Apple Polishing Cloth


యాపిల్ ఇటీవల తన కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఎయిర్‌పాడ్స్ 3 తో మరో ఉత్పత్తిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే ఆపిల్ ఫోన్ పాలిషింగ్ క్లాత్.. ఇది నెట్టింట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ఇది మైక్రోఫైబర్ పాలిషింగ్ క్లాత్, ఇది ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ స్క్రీన్ డిస్‌ప్లేను శుభ్రపరుస్తుంది. కోరిక ఉండాలే కాని బంగారం ధరతో సమానంగా గాలిని కూడా విక్రయించవచ్చనే సమెత ఇక్కడ అచ్చు గుద్దినట్లుగా సరిపోతుందని నెటిజన్లు సెటైర్లను సందిస్తున్నారు. అదే మాట ఆపిల్ తన పాలిషింగ్ క్లాత్ ధర విషయంలో నిరూపించింది. యాపిల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా స్టేటస్ సింబల్‌గా ప్రసిద్ధి చెందాయి. దాని ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడానికి కారణం కూడా ఇదే. కంపెనీ అధిక ధరలకు ఐఫోన్‌లు, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్ వాచ్ , ఐప్యాడ్‌లను తయారు చేసి విక్రయిస్తుంది. అయితే ఇటీవల యాపిల్ ఒక కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది.


ఇటీవల ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేసిన ఆపిల్.. మార్కెట్‌లో కొత్త ప్రొడక్ట్ మైక్రోఫైబర్ పాలిషింగ్ క్లాత్‌ని విడుదల చేసింది. ఇది కేవలం స్క్రీన్ శుభ్రపరిచే వస్త్రం అని చెప్పడానికి కానీ భారతదేశంలో దీని ధర రూ .1900గా నిర్ణయించింది. మరో ఆసక్తికరంగా మీరు దానిని కొనేందుకు మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. కొనుగోలు చేయడానికి నెలకు రూ. 224 EMI కూడా అందించింది.


ఆపిల్ పాలిషింగ్ క్లాత్ నిన్న కొత్త మాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్, హోమ్ మినీ డివైజ్‌లతో ప్రారంభించబడింది. ఇది మైక్రోఫైబర్ పాలిషింగ్ వస్త్రం, ఇది ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ స్క్రీన్ డిస్‌ప్లేను శుభ్రపరుస్తుంది. ఈ పాలిషింగ్ క్లాత్ చాలా మృదువుగా.. రాపిడి చేయని మెటీరియల్ నుండి తయారు చేయబడిందని ప్రకటనలో పేర్కొంది. ఇది ఫోన్ గ్లాస్‌ పనితీరును దెబ్బతీయదని కంపెనీ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ వస్త్రం ధర విన్న తర్వాత చాలా మంది భారతీయులు ఇందులో 2 జతల కొత్త బట్టలు కొనుగోలు చేయవచ్చని వ్యంగ్యస్త్రాలు పేలుస్తున్నారు.



No comments

Powered by Blogger.