Benefits of hibiscus tea: మీ ఇంట్లో ఉండే ఈ చెట్టు పూలతో టీ కాచుకోండి...!జన్మలో బీపీ మీ జోలికి రాదు...!!
Benefits of hibiscus tea: ప్రస్తుతం ప్రజల జీవన విధానం యాంత్రికం అయిపోయింది. పట్టణాల్లో వివిధ రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారు ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగుల మీద సాగుతోంది.
దీంతో పోషకాహారం, సరిపడా నిద్ర లేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇతర ఆలోచనలు తదితర కారణాల వల్ల బీపీ (రక్తపోటు) వస్తుంటోంది. దేశంలో ప్రతి నాలుగు మంది పెద్దలలో ఒకరికి బీపీ ఉంటోంది. బీపీని ఆహారంలో మార్పులు, మందుల సహాయంతో అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో మందారం పూల టీ చాలా ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. దేశంలో మందార పువ్వుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ మందారంతో తేనీరుని కూడా తయారు చేస్తారు. మందార పూల రసం రక్తపోటు ను తగ్గిస్తుందట. మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు, అంథోసైనిన్లు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇది రక్త నాళాలను సులభంగా నిర్భందిస్తుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
మందరం టీ తయారీకి ఎండ పెట్టన మందారం పూల పొడి, నిమ్మ కాయ, చక్కెర లేదా తేనె, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, నీరు.
Benefits of hibiscus tea: మందారం టీ తయారీ విధానం ఇలా
తొలుత చల్లటి నీటిలో మందారం పొడి రేకులన వేసి రెండు గంటల పాటు నాన బెట్టాలి. ఆ తరువాత ఈ నీటిని మట్టికుండలో కానీ గాజు పాత్రలో గానీ పోలి స్టౌ మీద మరిగించాలి. అలా మరిగించిన పానీయాన్ని వడకట్టి చక్కెర లేదా తేనె, నిమ్మరసం వేసుకుని తాగవచ్చు. ఇష్టమైన వారు దాల్చిన చెక్క లేదా పుదీనా ఆకులు వేసుకుని తాగవచ్చు.
No comments