BIG NEWS AP రైతులకు ముందే వచ్చిన దీపావళీ .....రైతు భరోసా-పీఎం కిసాన్...!!
రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విడుదల చేయనున్నారు.
దీంతోపాటే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, యంత్రసేవా పథకాల లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తారు. మూడు పథకాల కింద మొత్తం రూ.1,213 కోట్లను అర్హుల ఖాతాల్లో జమ చేస్తారు. 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద ఆగస్టులో రూ.977 కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేస్తున్న మొత్తం కలిపితే 50.37 లక్షల మంది రైతులకు రూ.2,052 కోట్ల లబ్ధి కలుగుతుంది. సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7 కోట్ల రాయితీ సొమ్ము జమ చేస్తారు. యంత్రసేవా పథకం కింద 1,720 సంఘాలకు రూ.25.55 కోట్ల లబ్ధి చేకూరనుంది' అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
No comments