Latest

Loading...

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.....?

Brain stroke

 చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ అనే సమస్య ఎందుకు వస్తుంది.. అనే విషయం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.. మెదడు ప్రతి రోజు ఎన్ని పనులు చేయాలి..? ఎన్ని విషయాల గురించి ఆలోచించాలి..?


అలాంటప్పుడు ఆ మెదడుకు కూడా మంచి విశ్రాంతి అనేది అవసరం. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన నిద్రలేమి, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఎన్నో రోగాల బారిన పడుతున్నాడు..ఇలా ఎన్నో కారణాలకు అధికంగా దెబ్బతినేది కేవలం మెదడు మాత్రమే. అందుకే మన మెదడు పనితీరు మందగిస్తుందే..ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి.. నిజంగానే ప్రాణాలకు ముప్పు ఉందా.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఎప్పుడైతే మనిషి యొక్క మెదడు పనితీరు దెబ్బతింటుందో.. అప్పుడు కచ్చితంగా ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది.. రక్త సరఫరా మెదడులో ఉన్న కొన్ని భాగాలకు ఆగిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఇక కణాల్లోకి ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని వైద్యులు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందట.. లేక పోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.. ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలను కొన్ని కొన్నిసార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందు కూడా మనం గమనించినా కూడా కచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.


బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే నెల రోజుల ముందు మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ముఖం ,కాళ్లు , చేతులు మొద్దుబారిపోవడం అనేది సాధారణమైన విషయం అయినప్పటికీ, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా ఇలా జరుగుతుంది.. ఒక సైడ్ మాత్రమే కాళ్లు ,చేతులు, ముఖం అన్నీ కూడా మొద్దుబారడం జరుగుతుంది .కంటిచూపులో కూడా తేడా వస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఆడవాళ్ళ లోనే ఎక్కువగా ఉంటుందట. మెదడు వెనుక భాగంలో నొప్పిగా అనిపించడం ,ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోవడం లాంటివి జరుగుతాయి.


శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు కనిపిస్తాయి . మహిళలలో అయితే ఉన్నట్టుండి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడం, అకస్మాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు రావడం ,వికారం ,వాంతులు చూపు సమస్యతో పాటు భ్రమపడుతూ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అధిక రక్తపోటుకు కూడా గురయ్యే ప్రమాదాలు ఉన్నాయని, దాని వల్ల మెదడులో రక్త సర ఫరా ఆగిపోయి ,రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఒక్కోసారి గర్భస్రావం కూడా జరుగుతుందట.


అందుకే ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే ముందుగా వైద్యున్ని సంప్రదించి, చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు


No comments

Powered by Blogger.