Covid: రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం.. 32 మంది విద్యార్థులకు పాజిటివ్..ఎక్కడంటే....?
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయలో చదువుతున్న 32 మంది విద్యార్థులు కరోనా బారినపడటం కలవరం రేగింది.
వీరిలో 10 మంది బాలికలు కాగా, 22 మంది బాలురు. వీరంతా 9 నుండి 12 తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులే. ఈ మొత్తంలో 10 మంది విద్యార్థులు కరోనా లక్షణాలు కన్పించగా.. మిగిలిన వారికి ఎటువంటి లక్షణాలు కన్పించలేదు.
ఈ పాఠశాల్లో మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక స్టాప్ సభ్యుడు కూడా కరోనా బారిన పడ్డారు. వీరంతా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా, ఏ ఒక్కరి పరిస్థితి కూడా క్రిటికల్‌గా లేదని స్కూల్ ప్రిన్సిపల్ పంకజ్షాన్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాలలను శానిటైజ్ చేశామని, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆరోగ్యాధికారి పాఠశాలను సంద్శించారు.
No comments