Latest

Loading...

ఈ చిట్కాలతో మీ ఇంట్లో ఉన్న డెంగ్యూ దోమలు పరారే, ఆ చిట్కాలు ఏంటంటే.....?

Dengue  Mosquitoes

 ఈ దోమలను నివారించడానికి, వివిధ రకాల దోమల వికర్షక క్రీమ్‌లు , లోషన్లను వాడుతారు. అయితే డెంగ్యూ, మలేరియా వ్యాధి ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, ఈ సీజన్‌లో ఎక్కడా నీరు నిలువ ఉండటానికి అనుమతించవద్దు. ఇది కాకుండా, ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోండి. అయితే ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం ద్వారా దోమల సమస్యను దూరంగా ఉంచవచ్చని మీకు తెలుసా. అయితే ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం ద్వారా దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు.


ఇంట్లో సులభంగా మేరిగోల్డ్ పూలను పెంచుకోవచ్చు. బంతి పూలు సులభంగా బాల్కనీ అందాన్ని పెంచడంతో పాటు ఫ్లైస్ దోమలను తరిమికొట్టడంలో బంతిపూలు తోడ్పడతాయి. పసుపు, ముదురు నారింజ, ఎరుపు రంగులలో బంతిపూలు ఉంటాయి. మన ఇంట్లో ఎక్కువగా పూజ చేసే మొక్కలలో తులసి ఒకటి. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది.


దోమలను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా పని చేసే మొక్కలలో లావెండర్ ఒకటి. దోమల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్ లో ఉన్న కెమికల్స్ ను వాడితే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. లావెండర్ నూనెను చర్మంపై రాసుకోవడం ద్వారా దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. నీలం రంగులో ఉండే రోజ్మెరీ పూలు దోమలకు సులువుగా చెక్ పెడతాయి. రోజ్‌మేరీని పావు వంతు ఆలివ్ నూనెతో కలిపి చర్మంపై రాసుకుంటే దోమలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సిట్రోనెల్లా గడ్డి ద్వారా దోమలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. డెంగ్యూ, మలేరియా దోమలను దూరంగా ఉంచడంలో సిట్రోనెల్లా గడ్డి తోడ్పడుతుంది.

No comments

Powered by Blogger.