Diabetes: ఈ 10 ఫ్రూట్స్‌ను డయాబెటీస్ పేషెంట్స్ నిస్సందేహంగా తినవచ్చట....అవేంటంటే...!!
ఎన్నో రోజుల నుంచి చెబుతున్న నిజం.. సరైన ఆహారం తీసుకుంటేనే రోగనిరోధక శక్తి immunity boost పెరుగుతుంది. ఈ పోషకాహారం ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు చాలా ముఖ్యం.
వీరికి తీపి తినాలనిపించినపుడు స్వీట్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినవచ్చు. మధుమేహంలో పండ్ల వినియోగంపై అనేక అధ్యయనాలు చేసినప్పటికీ సరైన పండ్ల వినియోగంపై కాస్త ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ర క్తంలో చక్కెర స్థాయిలతోపాటు అధిక రక్తపోటుతో పోరాడటానికి పయోగపడతాయి. ఈ పండ్లలో సమృద్ధిగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. విటమిన్ ఏ, బీ, సీ, ఈ, ఐరన్, కాల్షియం, మెగ్నిషీయం, ఫైబర్ ఉంటాయి. ఖనిజాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లకు పండ్లు పవర్‌హౌజ్.
యాపిల్స్..
ఒక అధ్యయనం ప్రకారం యాపిల్స్ apples కేవలం పోషకాహారాలు మాత్రమే కాదు, ఇవి మితంగా తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. రోజుకు ఒక యాపిల్.. డాక్టర్‌ను దూరంగా ఉంచుతుందనే పాత సామెతలో నిజం ఉందని తేలింది.
అవకాడో..
అవకాడో avocado లో ఆరోగ్యకరమైన ఫ్యాట్‌తోపాటు 20 శాతం ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది.
బెర్రీస్..
డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు బెర్రీస్ berries తినడం ఉత్తమ మార్గం. బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్లు, ఫైబర్ శక్తితో కూడుకున్నవి.
బొప్పాయి..
సహజ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నవి. ఇది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు సరైన ఆప్షన్. ఇవి papaya తినడం వల్ల భవిష్యతుల్లో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.
స్టార్ ఫ్రూట్..
ఈ తీపీ, పుల్లని పండులో డైటరీ ఫైబర్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ inflammatory ప్రక్రియను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సెల్ డ్యామేజ్‌ను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ స్టార్ ఫ్రూట్‌లో తక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది.
కీవీ..
ఈ కీవీ పండులో విటమిన్ ఈ, కే, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో కూడా చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు సంపూర్ణంగా అనుకూలమైన ఫ్రూట్.
పుచ్చకాయలు..
డయాబెటీస్ ఉన్నవారికి హైడ్రేటింగ్ పండ్లు తినడం మంచిది. దీనికి పుచ్చకాయలు తినాలి. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ, సీ వంటి బహుళ ప్రయోజనాలు మితంగా తినడం మంచిది.
డ్రాగన్ ఫ్రూట్..
డ్రాగన్ ఫ్రూట్‌లో కీలకమైన విటమిన్లు, న్యూట్రియెంట్స్, యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటాయి.
పీయర్స్..
పోషకాలు అధికంగా ఉండే పీయర్స్ పండ్లు కడుపు మంట, జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ఇది టైప్2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరెంజ్..
ఈ సీట్రస్ ఫ్రూట్‌లో ఫైబర్ నిండి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను శోషణం నెమ్మదిస్తుంది. విటమిన్ సీ వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
వాల్‌నట్స్, బాదం వంటివి కూడా జత చేయవచ్చు. శరీరంలో గ్లైసెమిక్ లోడ్‌ను సమతూల్యం చేయడానికి అవిసె గింజలను కూడా జోడించవచ్చు.
No comments