Latest

Loading...

Diwali Celebrations: దీపావళి సంబరాలపై ఆంక్షలు.. గ్రీన్‌ క్రాకర్స్‌తో జరుపుకోవాలని ప్రభుత్వం సూచన....!!

 

Diwali Celebrations






Diwali Celebrations Suggestions: దీపావళి పండుగ (Diwali Festival)ను పురస్కరించుకొని..


కాలుష్యాన్ని (Polution) నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా పలు సూచనలు చేస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ అశ్వినీ కుమార్ పరిడ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగను హరిత టపాసుల (Green Crackers)తో జరుపుకోవాలని సూచించారు. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కోరారు. గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వాయు, శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ తెలిపారు.


ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్‌ (Corona Third Wave) హెచ్చరికలు కూడా ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు సాధారణ టపాసులకు బదులు.. హరిత టపాసులను కాల్చాలని ఆయన సూచించారు. తయారుచేసేవాళ్లు, అమ్మే వాళ్లు కూడా వీటినే విక్రయించాలని సూచించారు. దీపావళి అంటే దీపాల పండుగ. దాన్ని శబ్దకాలుష్యం లేకుండా ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. టపాసుల అమ్మకానికి సంబందించి పీసీబీ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత ఇతర శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు అశ్వినీ కుమార్ తెలిపారు.


అసలు ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటి..?

సాధారణ టపాసులు కాలుష్య కారక టేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళిని ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తాయి. అలా కాకుండా కాలుష్య కారకాలను చాలా తక్కువ స్థాయిలో విడుదల చేసే హరిత టపాసుల ఫార్ములాలను శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలలి, జాతీయ, పర్యావరణ, ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఫార్ములా సాయంతో హరిత టపాసులు తయారుచేసేందుకు ఎంతోమంది బాణాసంచా తయారీదారులు సీఎఆర్-నీరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తక్కువ పరిమాణం, తక్కువ బూడిద, తక్కువ ముడి పదార్థాలు వాడి తయారు చేయడం ఈ హరిత టపాసుల ప్రత్యేకత. ఇవి మామూలు టపాసులకంటే 30 నుంచి 50 శాతం తక్కువగా కాలుష్యకారక వాయువులను, శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఈ హరిత టపాసుల మీద ప్రత్యేకంగా గ్రీన్ లోగో, క్యూఆర్ కోడ్ ఉంటాయి.


No comments

Powered by Blogger.