Latest

Loading...

Employees salary ఉద్యోగులకు రూ.15 వేలు పెరగనున్న జీతం...!!

Employees salary

 ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్ DA పెంచిన సంగతి తెలిసిందే. అయితే అది ఒక్కటే కాకుండా ఇప్పుడు కొంత మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది కేంద్రం.


కేంద్రం ఒక శుభవార్తని కొందరి ఉద్యోగులకు అందించింది. ఈ పండుగ సీజన్‌ లో కొంత మంది ఎంప్లాయీస్‌కు ప్రమోషన్ లభించింది. ఇండియన్ రైల్వేస్‌ లోని కొందరు ప్రమోషన్ పొందారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం చూసినట్లయితే.. ఇండియన్ రైల్వేస్ ఆఫీసర్లకు ప్రమోషన్ రావడం జరిగింది.


అయితే 7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చింది. ఇది నిజంగా ఆ ఉద్యోగులకి కాస్త బెనిఫిట్ గా ఉంటుంది. అదే విదంగా ఉద్యోగుల నెలవారీ జీతం రూ.15 వేల వరకు పెరగనుందని నివేదిక ద్వారా తెలుస్తోంది. అలానే రైల్వే బోర్డు సెక్రటేరియట్ సర్వీస్ / రైల్వే బోర్డు సెక్రటేరియట్ స్టీనోగ్రాఫ్స్ సర్వీసెస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. దీంతో వీరు సెక్రటరీ/డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి వెళ్లడం జరిగింది. అలానే కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఉద్యోగుల డీఏను 17 నుంచి 28 శాతానికి పెంచడం జరిగింది.

No comments

Powered by Blogger.