Latest

Loading...

Fasting : ఉపవాసంతో ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా...?

Fasting

 Fasting : సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఎవరైనా తన ఇష్టదైవానికి పూజలు చేసిన అనంతరం వారంలో ఆ ఇష్ట దైవానికి ఇష్టమైన రోజున ఉపవాసం చేస్తుంటారు.


ఇక ముస్లింలు కూడా రంజాన్‌ సమయంలో ఉపవాసం ఉంటారు. అయితే భక్తితో ఉపవాసం చేసినప్పటికీ నిజానికి ఉపవాసం చేయడం అనేది మంచిదే. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి మేలు చేస్తుంది.


ఉపవాసం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.


వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఆకలిపై నియంత్రణ ఉంటుంది. అధిక బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.


ఉపవాసం చేయడం వల్ల పైన చెప్పిన విధంగా పలు లాభాలనే పొందవచ్చు. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకు ఉపవాసం చేయడం మంచిది.

No comments

Powered by Blogger.