Good News : ఏపీకి రూ.1438 కోట్లు విడుదల చేసిన కేంద్రం...!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెవెన్యూ లోటు కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఏడో వాయిదా రెవెన్యూ లోటు కింద ఏకంగా 1438 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం
తాజా గా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10,066 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం వేళ తాజాగా విడుదల చేసిన నిధులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఊరట కలుగుతుందని ఎఫ్‌ఎంవో కార్యాలయం పేర్కొంది. అటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై హర్షం వ్యక్తం చేసింది.
No comments