Health Tips వావ్.. ఇవి చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చా....?
స్వీట్స్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. తియ్యని వంటకాన్ని చూడగానే ఎవరికైనా నాలుక జివ్వున లాగేస్తోంది. ఒక స్వీట్ ముక్కనైనా తినాలనిపిస్తుంది.అయితే, మరి ఆ స్వీట్స్‌లో ఉండే చక్కెర అంటే భయం కలుగుతుంది.
చక్కెరతో ఒబేసిటీ వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలుసు. అప్పుడు మరి ఏం చేస్తాం. ఏ విధంగా మన నాలుకకు తీపిని అందించి సంతృప్తి పరచాలి. ఇక దీనికోసమే ప్రత్యామ్నాయం వెతకాలి. అవేంటో తెలుసుకుందాం.
నిజానికి షుగర్‌కు బదులుగా ఇతర పండ్లను వెతుక్కోవడమే మేలు. ఎందుకంటే వైద్యులు సైతం వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మెగ్నీషియం, ఐరన్,కాల్షియం, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బీ-కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అంతేకాదు తేనెలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి చర్మ ఆరోగ్యానికి సైతం తోడ్పడతాయి. యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. ఇందులో ఫ్యాట్ కూడా ఉండదు. కాకపోతే కేలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
అల్పాహారానికి పండ్లు చక్కని ప్రత్యామ్నాయం. పీచు, ఫ్రక్టోజ్, విటమిన్లు, ఖనిజాలు యాంటి ఆక్సిడెంట్లను అందిస్తాయి. పండ్లను స్నాక్ మాదిరిగా తినవచ్చు.
తీపిని పూర్తిగా పక్కన పెట్టాలా?
చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. దీంతో పలు రోగాలకు దారితీస్తుంది. షుగర్‌ను రోజుకు రెండు చెంచాలకు మించి తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు. దీన్ని పూర్తిగా మానేస్తే... మరీ మంచిది! ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, బెల్లం, తేనె వంటివి చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.
కానీ, స్వీట్ తినకుండా ఉండలేనివారు చాలా మంది ఉంటారు. చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలనే తీసుకోవడానికి ప్రయత్నించాలి. బాగా శుద్ధి చేసిన ఫుడ్స్, ఐస్ క్రీంలు వంటివి మానేయాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పీచు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఫుడ్ వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో తీపిపై ఉండే వ్యామోహం కూడా తగ్గుతుంది.
No comments