Health Tips జామ, ఆకులతో అనేక సమస్యలు దూరం.....ప్రయోజనాలివే...!!
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా వివిధ వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, పీల్చే గాలి, మానసిక ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిళ్లు, నిద్రలేమితనం తదితర కారణాల వల్ల జబ్బుల బారిన పడుతున్నారు.
అయితే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడేది మన చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లు కూడా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. జామకాయలో ఎన్నో పోషకాలున్నాయి. జామతో ఎలాంటి లాభాలుంటాయో తెలిస్తే అస్సలు వదలరు. జామ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషధంలా పని చేస్తుంది. అలాగే ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం. రక్తంలో షుగర్స్ లేవల్స్‌ను తగ్గించేస్తుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.
*జామలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.
* ఇందులోఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి.
* జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
* ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది. ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
* జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
* జామ వల్ల బీపీ పెరగకుండా ఉంటుంది. జామలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది.
* జామలో విటమిన్-సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి.
* మనం తినే ఆహారం నుంచి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల మెదడు పనితీరు ఎంతో మెరుగు పడుతుంది.
* కాన్సర్ వస్తే దానిని వదిలించుకోవడం ఓ సాహసమే అని చెప్పాలి. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలు అధికంగా ఉన్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది.
* గుండెను కాపాడుతుంది. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, విషవ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్ వంటివి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి.
No comments