Latest

Loading...

Health Tips పల్లీలతో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి.....!!

Health Tips

 వేరుశెనగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒబేసిటీ సమస్యని కూడా ఇది తగ్గిస్తుంది. అలానే వేరుశనగ వల్ల చర్మానికి మరియు జుట్టుకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.


బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు వేరుశనగ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూద్దాం.


బరువు తగ్గొచ్చు:


ఒబెసిటి సమస్యని ఇది తగ్గిస్తుంది. అలానే బరువు కూడా తగ్గవచ్చు. రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్స్ పల్లీలు తినడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది.


ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే మంచిది:


వేరుశనగ ని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఫెర్టిలిటీని అది పెంచుతుంది. అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి పల్లీలను నీళ్ళల్లో నానబెట్టుకుని గర్భిణిలు తింటే మంచిది.


యాంటీ ఏజింగ్ గుణాలు:


పల్లీల నూనె మీ చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. అలాగే చర్మం ఎంతో బాగుంటుంది. దీని కోసం మీరు పల్లీల నూనెలో కొద్దిగా నిమ్మ రసం వేసుకొని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత ముఖాన్ని కడిగేసుకుంటే మీ ముఖం అందంగా మారుతుంది.


జుట్టు కి మంచిది:


పల్లీలు నూనె జుట్టు కి ఎంతో మేలు చేస్తుంది. చుండ్రుని కూడా ఇది తగ్గిస్తుంది. కొద్దిగా నీళ్లని నూనెలో వేసుకుని కలుపుకుని వారానికి మూడు సార్లు తలకు పట్టిస్తే జుట్టు కి మంచిది.ఇలా ఈ సమస్యలు పల్లీలతో తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలను మనం ఈజీగా దీనితో పొందవచ్చు.

No comments

Powered by Blogger.