Latest

Loading...

Health tips: కారు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నపుడు వాంతులవుతున్నాయా? అయితే ఈ టిప్స్​ను పాటించండి...!!

Health tips

 చాలామందికి కారు (car), బస్సు (Bus) ప్రయాణాలకు వెనకంజ వేస్తారు. బలవంతంగా ఎక్కించినా కొద్ది దూరం వెళ్లేసరికి వాంతులు (vomiting's) చేసుకుంటారు. ప్రయాణాలు చేసే వేళ (Travelling) చాలామందికి ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది.


శరీరానికి ఎంతో ఇబ్బందిగా ఉండడంతో కళ్లు తిరిగినట్లుగా, వాంతి (Vomiting's) వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ మనం బస్సు జర్నీల్లో.. కొందరికి వాంతులవడం చూస్తుంటాం. దీనినే మోషన్ సిక్ నెస్ (Motion sickness) అంటారు. ఇది జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ రుగ్మతకు కారణాలు అనేకం. ప్రయాణాలు (journey) చేస్తున్నప్పుడు.. బస్సు లేదా కారు (car) నుంచి బయటకు చూస్తున్నప్పుడు.. మన కళ్లకు కనిపించే చిత్రాలు, వినిపించే శబ్ధాలకు సంబంధించి మెదడు (brain)కు సంకేతాలు వేగంగా అందే విషయంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీని ప్రభావం మెదడు (brain) పైనే కాకుండా శరీరం పై కూడా పడుతుంది. దీని వల్ల కాస్త గాభరాగా అనిపించడం, కళ్లు తిరగడం, వాంతులవడం (Vomiting) వంటి లక్షణాలు సదరు వ్యక్తిలో మనకు కనిపిస్తాయి.


డీజిల్​, పెట్రోల్​ వాసన..


ఇక బస్సు లేదా కారు గుంతల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. శరీరం అటు ఇటూ తూలే సమయంలో ఈ లక్షణాలు మరింత పెరుగుతాయి. అంతేకాదు.. ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా తాగినా.. తిన్నా.. పెట్రోల్ (petrol), డీజిల్ వంటి వాసనలు (smell) ఎక్కువగా వచ్చినా.. ఈ రుగ్మతతో బాధపడేవారు చాలా ఇబ్బంది పడతారు.


తింటే బెటర్​..


ఏదైనా తిని ప్రయాణం చేస్తే వాంతులు (vomiting's) అయిపోతాయనే అపోహ ఉంది. అందుకే ఖాళీ కడుపుతోనే ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇది తప్పు.. ఎందుకంటే ఖాళీ కడుపు (Empty stomach)తో ప్రయాణించడం వల్ల.. నీరసం వంద రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మోషన్ సిక్ నెస్ (motion sickness) కూడా పెరుగుతుంది.


అందుకే ప్రయాణ సమయానికి ముందు కొద్దిగా ఏదైనా తినడం (eat) మంచిది. అయితే అరగడానికి ఇబ్బందిగా ఉండే నూనె వస్తువులు (oil items) కాకుండా.. కాస్త లైట్‌గా ఉండే ఆహారం (food) తీసుకోవడం మంచిది. తాజా పండ్లు (fresh fruit) తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పండ్లు లేదా పండ్ల రసాలు (fruit juice) కడుపును (stomach) ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి.


వెనక సీట్లో కూర్చోండి..


ప్రయాణ సమయంలో చాలామంది వెనుక సీట్లో (back side) కూర్చుంటూ ఉంటారు. కానీ మోషన్ సిక్‌నెస్‌తో బాధపడేవారికి ఇది శ్రేయస్కరం కాదు. అంతేకాదు.. కొన్ని స్పెషల్ బస్సులు లేదా రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో.. వ్యతిరేక దిశ (sit opposite direction)లో కూర్చోవాల్సి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకే బస్సుల్లో వెళ్తున్నప్పుడు కేవలం బస్సు వెళ్లే దిశలో కూర్చోవడమే మేలు. కార్లు మొదలైన వాహనాల్లో (vehicles) ప్రయాణిస్తున్నప్పుడు.. వెనుక సీట్లో కాకుండా ముందు వైపు కూర్చోవడం వల్ల సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. కిటికీ పక్కనే కూర్చొని తాజా గాలిని పీల్చుకుంటూ సంగీతం (music) వింటూ వెళ్లడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పైగా సమస్యను కూడా తగ్గిస్తుంది.


No comments

Powered by Blogger.