Health Tips బెల్లం, పప్పు కలిపి తింటే ఎన్నో ప్రయోజనాలో తెలుసా....?
ప్రతి రోజూ బెల్లం తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. బెల్లం తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే కాస్త బెల్లం తింటే గొంతు సాఫీగా ఉంటుంది.
అయితే బెల్లంతో పాటు పప్పును కలిపి తినడం వలన కూడా అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇవి శరీరాన్ని అనారోగ్యాల బారిన పడకుండా చేస్తాయి. అలాగే రక్తహీతన సమస్యను నివారిస్తాయి. జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. చర్మ సమస్యలను కూడా తగ్గించవచ్చు.-- బెల్లం, పప్పు కలిపి తీసుకోవడం వలన రక్తహీనత తగ్గుతుంది. అలాగే శరీరంలో బ్లడ్ లెవల్స్ పెరుగుతాయి.
1. బెల్లం, పప్పు కలిపి తింటే రోగ నిరోధక శక్తిని పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
2.వేయించిన పప్పులో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో ఐరన్, ప్రోటీన్ లోపం తగ్గుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
3.బెల్లం, పప్పు కలిపి తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. వృద్ధాప్య సమయంలో ఎముకలు బలహీన పడడం జరుగుతుంది. ఈ సమయంలో వృద్దులు బెల్లం, పప్పు కలిపి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.
4. బెల్లం, పప్పులో ఫైబర్ ఉంటుంది. ఈ రెండింటినీ తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం, అసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది.
No comments