Latest

Loading...

Heartburn గుండెలో మంటగా ఉందా....? అయితే వీటికి దూరంగా వుండండి...!!

Heart burn

 గుండెలో మంటగా ఉందా..? అయితే తప్పకుండా మీ యొక్క డైట్ ని చూసుకోండి. ఈ మధ్య కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు గుండెల్లో మంట ఎక్కువగా వస్తుంది. తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యే విధంగా ఉంటే అప్పుడు గుండెల్లో మంట వస్తుంది.


అయితే గుండెలో మంట రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.


ఫ్రై:


నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెలో మంట వస్తుంది. ఎందుకంటే ఇవి అరగడగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలానే మనం బయట బజ్జీలు మొదలైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తింటూ ఉంటాం. వీటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.


పాలల్లో ఉండే లాక్టోస్:


పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. లాక్టోస్ జీర్ణం అవ్వడానికి ఎంజైమ్స్ అవసరం. ఎంజైమ్లు లేకపోవడం లేదా తక్కువగా ఉండడం వల్ల జీర్ణమవడం కష్టమవుతుంది.


మసాలా ఆహార పదార్థాలు:


మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి డైట్ లో మసాలా తో చేసే వంటలు తగ్గించండి. అలానే పప్పులు, రాజ్మా, బీన్స్ వంటివి కూడా ఎక్కువ తీసుకొద్దు.


సిట్రస్ ఫ్రూట్స్:


సిట్రస్ ఫ్రూప్ట్స్ వలన కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది. అలానే క్యాబేజీ, బ్రోకలీ, ముల్లంగి వంటివి కూడా జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి గుండెల్లో మంట వస్తే వీటికి కూడా దూరంగా ఉండటం మంచిది. దీనితో ఆరోగ్యంగా ఉండచ్చు అలానే ఇబ్బంది కూడా రాదు.


No comments

Powered by Blogger.