IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు....!!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింద
మొత్తం 7855 ఖాళీలను ప్రకటించింది. జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి ఐబీపీఎస్ ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో 5,830 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇప్పుడు పోస్టుల సంఖ్యను 7855 కి పెంచడం విశేషం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 అక్టోబర్ 27 లోగా దరఖాస్తు చేయాలి. జూలై 12 నుంచి 14 మధ్య అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీల సంఖ్య, విద్యార్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS Clerk Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి. ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రాయొచ్చు.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS Clerk Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లోని CRP Clerical Cadre XI సెక్షన్‌లోకి వెళ్లాలి.
Common Recruitment Process for Clerical Cadre XI లింక్ క్లిక్ చేయాలి.
ఈ సెక్షన్‌లో జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది. పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
మీ పేరు, పుట్టిన తేదీ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత మీ ఫోటో, సంతకం, చేతితో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
వివరాలన్నీ ఓసారి చెక్ చేయాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175, ఇతర అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి
No comments