Lemon Grass Benefits ఈ మొక్క ఇంట్లో పెడితే ఆ వాసనకి ఒక్క దోమ కూడా ఉండదు.....!!!
Lemon Grass Benefits in telugu :మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటిలో కొన్ని మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి అలాగే కొన్ని మొక్కలు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి మన పూర్వీకులు ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్స్ మందుల జోలికి వెళ్లకుండా చుట్టుపక్కల ఉన్న మొక్కలతో ఆ సమస్యలను పరిష్కరించుకునే వారు
ఇంట్లో దోమలు ఉన్నాయంటే వాటిని తరిమి కొట్టడం చాలా కష్టం దోమలు ఇంట్లో లేకుండా చేయటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ అవి పూర్తిగా ఫలితాలనివ్వవు అయితే ఒక మొక్కను ఇంటిలో పెంచుకుంటే దోమలు ఉండవు
ఆ మొక్క లెమన్ గ్రాస్ దీనినే నిమ్మగడ్డి అని అంటారు నిమ్మగడ్డి లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి నిమ్మగడ్డి నుండి తీసే నూనెను కాస్మోటిక్స్ పెర్ఫ్యూమ్స్ మందుల తయారీలో ఉపయోగిస్తారు
నిమ్మగడ్డి మొక్కను బాల్కనీ లేదా పెరట్లో పెంచుకోవచ్చు ఈ మొక్కకు 5 నుంచి 6 గంటలు ఎండ తగిలేలా ఉండాలి నిమ్మ గడ్డి మొక్క ఎండ తగిలేలా ఉంచితే దానిలో ఉండే అరోమా బయటికి వస్తుంది.
ఈ వాసనకు పాములు దోమలు కీటకాలు మన ఇంటి చుట్టుపక్కలకి రావు.
నిమ్మగడ్డి వాసన దోమలకు పాములకు అసలు పడదు. ఈ మధ్యకాలంలో దోమల కారణంగా డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయి వాటి నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే ఇంటిలో లెమన్ గ్రాస్ అంటే నిమ్మ గడ్డి మొక్కలు పెంచుకోవాలి
నిమ్మ గడ్డి తో తయారు చేసిన టీ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు అలాగే గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి
No comments