LPG Price Hike : భారీగా పెరిగిన గ్యాస్ ధరలు...సిలిండర్‌పై రూ.266 పెంపు....!!
కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఏకంగా రూ.266 పెంచేసింది. పెరిగిన ధరలు నేటి నుంచి (నవంబర్ 1) అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటేసింది.
అంతకుముందు కమర్షియల్ సిలిండర్ ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబై నగరంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950గా ఉండగా.. కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధరలు కూడా భారగా పెరగడంతో వినియోగదారులు హడలిపోతున్నారు.
కమర్షియల్ వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. అక్టోబర్ 1న 19 కిలోల కమర్షియల్, 6న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. కోల్‌కతాలో ప్రస్తుతం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.926 ఉండగా.. చెన్నైలో రూ.915.50 ధర పలుకుతోంది. ముడిచమురు ధరలు పెరగడంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగిపోతాయనే ఆందోళనలు నెలకొన్నాయి.
No comments