Latest

Loading...

Morning Walk : ఉదయాన్నే ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారా.....! అయితే చాలా హానికరం...!!

Morning Walk

 Morning Walk : మనిషికి సెల్‌ఫోన్ ఇప్పుడు గుండెకాయలా మారింది. అది లేనిదే ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే 60 ఏళ్ల వృద్ధుడి వరకు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్‌ కనిపిస్తుంది.


దాని వల్ల ఎంత హాని జరిగినా వదిలిపెట్టడం మాత్రం జరగదు. అయితే ఆరోగ్యం కోసం ఉదయాన్నే చేసే వాకింగ్‌ సమయంలో కూడా మొబైల్‌ వాడుతున్నారు. ఇది సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.


1. వెన్నెముకకు ఎఫెక్ట్

వాకింగ్‌ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండాలి. ఆ సమయంలో మీరు మొబైల్‌ వాడితే డిస్ట్రబ్‌ అవుతారు. అంతేకాదు పదే పదే మొబైల్‌ స్క్రీన్ చూడాలనే తాపత్రయంతో ఇష్టమొచ్చిన విధంగా వాకింగ్‌ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలికంగా వెన్నెముకపై ఎఫెక్ట్ పడుతుంది.


2. కండరాల నొప్పి

ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. కానీ ఒక చేతిలో మొబైల్ పట్టుకొని వ్యాయామం చేస్తారు. దీనివల్ల వల్ల కండరాలు అసమతుల్యమవుతాయి. అప్పుడు కండరాల నొప్పి ప్రారంభమవుతుంది.


3. వెన్నునొప్పి ఫిర్యాదు

మార్నింగ్ వాక్‌లో మొబైల్ చూస్తూ నడుస్తుంటే మీ మెడ, వెన్ను నొప్పి మొదలవుతుంది. ఈ కారణంగా సరిగ్గా నడవకుండా అడుగులు తప్పుగా వేస్తూ ఉంటాం. సరైన దిశలో వాకింగ్ ప్రక్రియ జరగదు. ఇలా చేయడం వల్ల మెడ, వెన్నుపూసలో నొప్పి వస్తుంది. ఇది నడుమును ప్రభావితం చేస్తుంది.


4. ఏకాగ్రత ఉండదు

వాస్తవానికి ఏకాగ్రతతో వాకింగ్‌ చేయడం వల్ల శరీరానికి ఫలితం ఉంటుంది. కానీ మొబైల్ చూస్తూ నడవడం వల్ల మన దృష్టి వాకింగ్‌పై ఉండదు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల నడుస్తున్నప్పుడు ఫోన్ వెంట ఉండకూడదు గుర్తుంచుకోండి.


No comments

Powered by Blogger.