Latest

Loading...

Mosquito: దోమకుట్టిందా...అయితే ఇకపై రోగాలు రావంట.. ఎందుకో తెలుసా....?.

Mosquito

 దోమ కాటుతో ఎన్ని అనర్థాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైఫాయిడ్​, మలేరియా, డెంగ్యూ, చికెన్​ గున్యా వంటి రోగాలన్నింటికీ దోమలే మూల కారణమన్న విషయం తెలిసిందే

అందుకే, అవి కనిపిస్తే చాలు ఏ మాత్రం జాలి లేకుండా చంపేస్తుంటాం. అయితే, ఈ తాజా వార్త వింటే దోమల్ని చంపడం కాదు కదా.. చిన్న హాని కూడా తలపెట్టం.


ఎందుకంటారా?.. దోమల్లో ఉండే AEG12 అనే ప్రోటీన్​ అనేక వైరస్​లను చంపేస్తుందట మరి!.. ఆశ్చర్యకరంగా ఉంది కదూ.. తాజాగా యుఎస్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) శాస్త్రవేత్తలు అధ్యయనంలో ఈ విషయం తేలింది. దోమల్లోని AEG12 అనే పేరున్న ప్రొటీన్ ఎల్లో ఫీవర్​, డెంగ్యూ, వెస్ట్ నైల్, జికా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే వైరస్​లను గట్టిగా నిరోధిస్తుందని, కరోనా వైరస్​ను కూడా ఈ ప్రోటీన్​ బలహీన పరుస్తుందని తేలింది.


ఆయా వైరస్​లను అస్థిరపరచడంలో, దాని రక్షణ కవచాన్ని విచ్ఛిన్నం చేయడంలో AEG12 ప్రోటీన్​ బాగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలపై దాడి చేస్తున్న కరోనా వంటి ప్రమాదకర వైరస్​లకు చెక్​ పెట్టేందుకు ఈ దోమ ప్రోటీన్​ ఉపయోగపడుతుందని ఎన్ఐహెచ్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ పరిశోధన ఫలితాలు పిఎన్‌ఎఎస్‌ ఆన్‌లైన్‌ జర్నల్​లో ప్రచురించబడ్డాయి.


కరోనా వైరస్ చికిత్సలోనూ..

కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) లో భాగమైన యూఎస్​ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ (NIEHS) శాస్త్రవేత్తలు దోమలోని AEG12 ప్రోటీన్​ నిర్మాణాన్ని విశ్లేషించేందుకు ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాలపై సీనియర్ రచయిత జెఫ్రీ ముల్లెర్న్​ మాట్లాడుతూ ''వైరస్ పొరలో ఉన్న లిపిడ్లను పొందేందుకు AEG12 ప్రోటీన్​

బలంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో తన చుట్టూ ఉన్న పొరలోని కొన్ని లిపిడ్లను వదిలించుకొని వైరస్ పొర నుంచి కొన్ని లిపిడ్లను అది లాగేసుకుంటుంది. తద్వారా వైరస్ ను ఇది విచ్ఛిన్నం చేస్తుంది." అని అన్నాడు.


అయితే, ఈ ప్రోటీన్​తో వైరస్​ను ఎంత మేర బలహీనపరచవచ్చనే విషయంపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దోమల్లోని AEG12 ప్రోటీన్​.. జికా, వెస్ట్ నైల్ వంటి వైరస్ కుటుంబానికి చెందిన ఫ్లేవివైరస్​కు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అదేవిధంగా, కోవిడ్ -19 కి కారణమయ్యే SARS-CoV-2 కు వ్యతిరేకంగా కూడా AEG12 ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనం తెలిపింది. అయితే, కోవిడ్--19కి వ్యతిరేకంగా ఇది ఎంతమేర ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని, ఇది చికిత్సగా మార్చడానికి సంవత్సరాల కొద్ది సమయం పడుతుందని ముల్లెర్ అభిప్రాయపడ్డారు.


No comments

Powered by Blogger.