Pecan Nuts: పీకన్ నట్స్ గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్ ఇదే....!!
Pecan Nuts: డ్రై ఫ్రూట్స్ లో పీకన్ నట్స్ ఒకటి.. ఈ నట్స్ గురించి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.. అయితే పీకన్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..
ఇవి చూడటానికి వాల్ నట్స్ లా ఉంటాయి.. అయితే ఇవి తినటానికి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.. పీకన్ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు..!!
Pecan Nuts: పీకన్ నట్స్ తో డయాబెటిస్ కు చెక్..
ఈ నట్స్ లో విటమిన్ ఏ, ఈ జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ నట్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఈ నట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కొంత మంది మధుమేహుల్లో ఎక్కువగా ఆకలి ఉంటుంది. అటువంటి వారు ఈ నట్స్ తినడం వలన త్వరగా ఆకలి లేదు. చిరుతిళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు.
వీటిని తినటం వలన సులువుగా బరువు తగ్గుతారు. ఉబకాయం తో బాధపడే వారికి ఈ నట్స్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. వీటిని తినటం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. వీటిలో శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్ ఉంటుంది.
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఈ నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక సీజన్ల లో వచ్చే ఇన్ఫెక్షన్ల, ఫ్లూ బారిన పడకుండా కాపాడుతుంది. శరీరంలో కి చెడు వైరస్ ప్రవేశించకుండా చూస్తుంది. ఈ నట్స్ను చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.
No comments