సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచివి.. ఎందుకంటే....?
బిరియాని (బాస్మతి) రైస్ కేవలం రుచి కోసమేనా లేదా అందులో ఏవైనా పోషక విలువలుంటాయా...?
డాక్టర్ సమాధానం: చక్కటి సువాసన, రుచి కలిగినది బాస్మతి బియ్యం. బ్రౌన్ బాస్మతి, వైట్ బాస్మతి అనే రెండు రకాల్లో ఎక్కువగా లభిస్తుంది. బ్రౌన్ బాస్మతి బియ్యాన్ని తెల్లటి దానితో పోలిస్తే ఇందులో పీచుపదార్థం, వివిధ రకాల బీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ బియ్యంలో పోషకాలు ఎక్కువే. గ్లైసీమిక్ ఇండెక్స్ బ్రౌన్ బాస్మతి రైస్‌కు తక్కువ. తెల్ల బియ్యం కంటే తెల్ల బాస్మతి బియ్యానికి కూడా గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే. మిగతా పోషక విలువలలో తెల్ల బియ్యానికి, తెల్లబాస్మతికి పెద్దగా తేడాలుండవు. మామూలు బ్రౌన్ రైస్ కంటే కూడా బ్రౌన్ బాస్మతి రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి రక్తంలో గ్లూకోజు నియంణ్రకు ఈ బాస్మతి బియ్యం మంచిది. అంతేకాకుండా సాధారణంగా మనం వినియోగించే బియ్యం రకాల కంటే మెరుగైనదని చెప్పవచ్చు. మిగిలిన పోషకాలు అన్ని రకాల బ్రౌన్ రైస్‌లలోనూ ఒకే విధంగా ఉంటాయి.
No comments