Rice : ఏ రకపు బియ్యం అయినా క్యాన్సర్ కారకమే.. ఈ విధానం లో వండుకుంటే ప్రమాదం ఉండదు ....!!
Rice : ఆర్సెనిక్ పదార్దం
బియ్యంలో హానికరమైన ఆర్సెనిక్ పదార్దం ఉండడం వలన అది తినేవారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆర్సెనిక్ అనేది సహజంగా తయారయ్యే ఒక మూలకం.
అది మట్టిలో , నీళ్లలో కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. ఈ ఆర్సెనిక్ విషపూరితంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని యూరోపియన్ యూనియన్ క్యాన్సర్ కారకాల మొదటి కేటగిరీ లో ఉంచింది. పంటలకు పురుగుల మందులు వేసినప్పుడు ఈ విషరసాయనం నేలలోకి ఇంకి పంట ధాన్యాల్లోకి చేరుతుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. ఇలా రోజు రోజుకి మట్టిలో ఉన్న ఆర్సెనిక్ శాతం పెరుగుతుంది అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
Rice : బ్రౌన్ రైస్ లో మాత్రం
బియ్యంలో ఉన్న ఆర్సెనిక్ మూలకం గురించి 2014 వ సంవత్సరం లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే బాస్మతి బియ్యంలో మాత్రం ఆర్సెనిక్ స్థాయి తక్కువగా ఉండి , బ్రౌన్ రైస్ లో మాత్రం ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. బియ్యపు గింజ చుట్టూ ఉండే పొట్టు ఇందుకు కారణం అని నార్తర్న్ ఐర్లాండ్ బెల్‌ఫాస్ట్‌లో ఉన్న క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు తెలియచేసారు . ఇక్కడ గమనించవలిసిన విష్యం ఏమిటంటే. ఆర్గానిక్ పద్దతిలో చేసే వరి సాగు వల్ల కూడా ఆర్సెనిక్ స్థాయిలో ఎటువంటి మార్పు ఉండదని కూడా తెలిసిచ్చేస్తున్నారు.
ఈ పద్దతిలో వండుకుంటే
బియ్యం పై పొరలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటున్న కారణం గా పాలిష్ చేయని ముడి బియ్యం తినవద్దని పరిశోధకులు తెలియచేస్తున్నారు.
శరీరంలోకి మోతాదు మించి ఆర్సెనిక్చేరడం వలన అనేక సమస్యలు మొదలవుతాయి. వాంతులు అవడం, కడుపు నొప్పి రక్తవిరేచనాలుఆ అవుతుండడం , వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి . దీర్ఘ కాలం పాటు ఆర్సెనిక్ శరీరంలోకి చేరితే షుగర్ , గుండెకు సంబందించిన సమస్యలు , క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ,తర్వాత రోజు శుభ్రమైన నీళ్లతో బాగా కడిగి వండుకుంటే మాత్రం ఆర్సెనిక్ స్థాయి తగ్గుతుంది. ఉడికించే టప్పుడు గంజి వార్చుకుంటే అన్నంలో ఆర్సెనిక్ స్థాయి తగ్గుతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
No comments