ఫ్రెషర్స్‌కు Tech Mahindra గుడ్‌న్యూస్...ఇంటర్ అర్హతతో కార్పోరేట్ కంపెనీలో జాబ్...!!.
ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క ఐటీ రంగమే 31 శాతం వరకు ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
ఈ-కామర్స్ కంపెనీలతో కలిసి అత్యధిక ఇంక్రిమెంట్లను అందించాలని యోచిస్తున్న ఏకైక రంగం ఐటీ కావడం విశేషం. ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ మూడు రెట్లు అధికంగా ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రస్తుతం టెక్ మహీంద్రా యోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్నాలజీ విభాగాల్లో ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించాలని భావిస్తోంది.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కంపెనీ త్రైమాసికంలో కొత్తగా 5,200 ఉద్యోగులను నియమించింది. దాంతో ప్రస్తుతం ఈ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.26 లక్షలకు దాటింది. ఈ విషయాన్ని ఎండీ, సీఈఓ సీ.పీ గుర్నాని వెల్లడించారు. అలాగే మిగిలిన ఆర్థిక సంవత్సరంలోనూ అదే స్థాయిలో లేదా ఇంకా ఎక్కువ మందిని నియమించుకుంటామని తెలిపారు. 2021-22 జూన్ త్రైమాసికానికి టెక్ మహీంద్రా 39.2% ఏకీకృత నికర లాభం రూ. 1,353 కోట్లకు పెరిగింది. త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం నెలవారీగా 7% పెరుగుతూ రూ. 10,485 కోట్లకు చేరుకుంది. మిగిలిన ఆర్థిక సంవత్సరంలో మరింత వృద్ధిని సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోందీ కంపెనీ. టెక్ మహీంద్రా 3,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లను నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు ఎడ్టెక్ (EdTech) స్టార్టప్ కెరీర్లబ్స్ (CareerLabs)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ట్రైనింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్లు టెక్ మహీంద్రాలోని వివిధ భాగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
కాగా,పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఆసక్తిగల అభ్యర్థులు https://careers.techmahindra.com/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్‌మహీద్రా ఫెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషన్స్‌ను కూడా నియమించుకుంటోంది.సీనియర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్ట్ లీడ్, సపోర్ట్ కన్సల్టెంట్ మొదలైన పోస్టులకు అనుభవజ్ఞులైన నిపుణులను నియమిస్తోంది. పూర్తి వివరాల కోసం https://careers.techmahindra.com/ క్లిక్ చేయండి.
No comments