Latest

Loading...

Telangana: తెలంగాణలో వ్యాక్సినేషన్ తీసుకోనివారికి హెచ్చరిక..... రేషన్, పెన్షన్ కట్...!!.

Telangana


కరోనా టీకాల తీసుకోనివారికి అలెర్ట్. వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్‌ను నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది.


ఈ నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకుని.. రెండో డోస్ వేసుకోనివారు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. డోస్ తీసుకోవాల్సిన డేట్ దాటిపోయినా కూడా వారు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఈ విషయంపై అధికారులు పదేపదే వివరిస్తూ వచ్చినా కూడా జనాలు పట్టించుకోకపోవడంతో కఠిన చర్యలకు సిద్దమయ్యారు.


ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ కట్ అవుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని.. దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమని ఆయన తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనితో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని భావిస్చేతున్యనట్డంలుగా చెప్పుకొచ్చారు.

No comments

Powered by Blogger.