Latest

Loading...

Warm Water With Honey వేడి నీటిలో తేనె కలుపుకొని తాగుతున్నారా..! ఆయుర్వేదం ప్రకారం ఇది హానికరమట.....?

Warm Water With Honey

 Warm Water With Honey 

చాలా మంది బరువు తగ్గడానికి పరగడుపున గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుందని చెబుతారు.

తేనె, సహజ స్వీటెనర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉంటుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది, కాలిన గాయాలకు చికిత్స చేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. తేనె ప్రాసెస్ చేయబడిన చక్కెరకు ప్రత్యామ్నాయం. డయాబెటిస్ రోగులకు సురక్షితం. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, జింక్‌ అధికంగా ఉంటాయి. ప్రజలు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలపి తాగడం సహజం.


ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి నీటిలో కలుపకూడదని నిపుణులు వాదిస్తున్నారు. ఇలా కలిపితే శరీరానికి హానికరమని చెబుతున్నారు. వేడి చేసిన తేనె స్లో పాయిజన్‌ అని, దాని లక్షణాలు శరీరంలో ఒక్కోసారి విషంగా మారుతాయని అంటున్నారు. అంతేకాదు దీనివల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుందని తద్వారా అనేక వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు. తేనెను ఎప్పుడైనా సహజ, ముడి రూపంలో వినియోగించాలని అప్పుడే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదులు వాదిస్తున్నారు.


అంతేకాదు సూపర్‌బజార్, స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో డయాబెటిస్ రోగులకు హాని కలిగించే మొక్కజొన్న సిరప్ లేదా ఇతర కృత్రిమ స్వీటెనర్‌లు కలుపుతారన్నారు. ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు ఇందులో ఉండవన్నారు. సూపర్ మార్కెట్లలో లభించే తేనె వేడి చేసి ప్యాక్ చేస్తారు. స్టోర్స్ నుంచి తేనెను ఎప్పుడు కొనవద్దన్నారు. తేనెటీగల నుంచి సహజంగా వచ్చే తేనెను విక్రయించాలని సూచించారు. అంతేకాదు తేనెను ఎప్పుడైనా వేడి చేయకుండా చల్లగా ఉన్నప్పుడే తినాలని, అదే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.

No comments

Powered by Blogger.