Latest

Loading...

7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే...!

7th Pay Commission

 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త అందించింది. నవంబర్ పెన్షన్‌తో కలిపి కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పెరిగిన కరువు భత్యం ప్రయోజనాన్ని పొందనున్నారు.


వీటితో పాటు గత నాలుగు నెలల బకాయిలు కూడా వారికి నెలాఖరులోగా ఖాతాల్లోకి జమ కానున్నాయి.


ఈ ఏడాది జూలై 1 నుండి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లను 31 శాతానికి పెంచారు. నవంబర్‌లో రిటైర్ కానున్న ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్‌ల బకాయిలు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. జాతీయ మీడియాలో ఈ వివరాలు రిపోర్ట్ చేశారు. బేసిక్ శాలరీపై డీఆర్ లెక్కిస్తారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ రూ. 20,000 అయితే అతని నెలవారి శాలరీ రూ.600 మేర పెరుగుతుంది. ఇది గమనిస్తే 3 శాతం డీఆర్ పెరిగినట్లు తెలుస్తోంది.


త్వరలో బకాయిలు విడుదల

7వ వేతన సంఘం ప్రతిపాదనల ఆధారంగా ఆఫీసర్ గ్రేడ్ జీతంలో భారీగా పెరుగుదల కనిపించింది. ఉద్యోగి బేసిక్ శాలరీ ప్రస్తుతం రూ. 31,550 అయితే, ఇప్పటి వరకు వారు 28 శాతం డీఆర్ ప్రకారం రూ. 8,834 వస్తోంది. 3 శాతం పెంచడంతో 31 శాతం డీఆర్‌తో ఆ ఉద్యోగి నెలకు రూ.9,781 అందుకుంటారు. క్రితంతో పోల్చితే నెలకు రూ.947 జీతం పెరగనుంది. ఏడాది మొత్తంలో రూ.11,364 అధికంగా అందుతుంది. ఆఫీసర్ గ్రేడ్ జీతం ఆధారంగా లెక్కిస్తే ప్రతి నెలా డీఆర్ రూ.947 పెరుగుతుంది. మొత్తం 4 నెలల బకాయి చూస్తే రూ.3,788 ఉద్యోగులకు లభిస్తుంది. వీటితో పాటు నవంబర్‌లో పెరిగిన డీఆర్‌ను కూడా కలిపితే పెన్షనర్లకు రూ.4,375 రావాల్సి


గతంలోనే కేంద్ర ఆమోదం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరియు డియర్‌నెస్ రిలీఫ్‌(డీఆర్)లలో 3 శాతం పెంపును కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదించింది. గతంలో కేంద్ర ఉద్యోగుల డీఏ 11 శాతం పెరగడంతో 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. కరోనా సమయంలో బకాయి పడ్డ మూడు వాయిదాలను చేర్చడంతో 28 శాతం కాగా, తాజాగా మరో 3 శాతం పెంచారు. దీంతో ప్రస్తుత డీఏ 31 శాతానికి చేరింది. కానీ కేంద్రం ప్రకటన ఇంకా రాలేదు. డీఏ తాజా పెంపుతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. సవరించిన డీఏ, డీఆర్ కారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,488.70 కోట్ల భారం పడనుంది.


జూలై నుంచి పెరిగిన డీఏ..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2021 నుంచి సవరించిన డీఏ అమల్లోకి వచ్చింది. కోవిడ్ కారణంగా, వాయిదా వేసిన 3 దఫాల డీఏను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమోదం లభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సవరించిన నగదు చేతికి రానుంది. డీఆర్, డీఏలు జనవరి 2020 జనవరి 1 నుంచి జూలై 1 మరియు 2021 వరకు మూడు దఫాల బకాయిలు కేంద్రం కొన్ని నెలల కిందట పెంచింది. బేసిక్ శాలరీపై డీఏ లెక్కిస్తారు.

No comments

Powered by Blogger.