Latest

Loading...

Aadhaar card ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అయిందా....?ఎలా తెలుసుకోవాలి.....?

Aadhaar card

 ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అయిందా..? ఎలా తెలుసుకోవాలి...?


ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకు ఆదార్ కార్డ్ అనేది చాలా కీలకం అనే విషయం తెలిసిందే.


అయితే ఈ మధ్య కాలంలో దీన్ని ఆర్ధిక మోసాలకు కొందరు వాడుతున్నారు. పొరపాటున ఎవరైనా ఆధార్ కార్డ్ పోగొట్టుకుంటే అది ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి. సాధారణంగా వివిధ రకాల పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల్లో వ్యక్తి గుర్తింపు ధృవీకరణగా ఎక్కువగా ఆధార్ వాడుతున్న నేపధ్యంలో మిస్ యూజ్ ఎక్కువగా చేస్తున్నారు.


ప్రభుత్వ సేవలకు ఇది చాలా కీలకమైంది. బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయడానికి ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఇలా ఎన్నో అవసరాలకు ఆధార్ కీలకంగా మారింది. అయితే ఇందులో ఉన్న సమాచారం బయటకు వస్తే అది ఎలా అయినా సరే వాడే అవకాశం ఉంటుంది. అయితే ఇది మిస్ యూజ్ అవుతుందో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. ఈ టెక్నిక్ ద్వారా మీ ఆధార్ కార్డ్ ఎక్కడ వాడుతున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డును అందించే యుఐడీఎఐ ఈ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.


ముందుగా మీరు సంస్థ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తరువాత, ఆధార్ సేవలకు వెళ్లి, ఆధార్ హిస్టరీ ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత, మీరు మీ ఆధార్ నంబర్ మరియు సెక్యూరిటీ కోడ్‌ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తప్పనిసరిగా ఒటీపీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒటీపీని ఎంటర్ చేస్తే మీ కార్డు హిస్టరీ వస్తుంది. మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే మాత్రమె ఇది సాధ్యం అవుతుంది.

No comments

Powered by Blogger.