Latest

Loading...

Aadhaar card ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్.....ఇక నుండి కొత్త సేవలు....!!

Aadhaar card

 మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ప్రభుత్వ స్కీమ్స్ మొదలు ఎన్నో విధాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది. కొత్త సేవలు తాజాగా అందుబాటు లోకి రావడం జరిగింది.


ఆధార్ కార్డు ఉన్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..


ఇకపై ఆధార్ వెరిఫికేషన్‌ ని చేయించుకోవాలంటే ఆఫ్‌లైన్‌ లో కూడా డిజిటల్ సైన్డ్ డాక్యుమెంట్ షేరింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అయితే దీనిలో ఆఖరి నాలుగు డిజిట్స్ మాత్రమే కనపడతాయి. అలానే మీ పేరు, మీ వివరాలు కూడా ఉంటాయి.


ఇది ఇలా ఉంటే ఇకేవైసీ ప్రక్రియకు ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలో కేంద్రం తెలిపింది. అలానే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు వెరిఫికేషన్‌కు సంబంధించి కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వస్తూనే వున్నాయి.


కేవలం ఆన్‌లైన్ వెరిఫికేషన్ మాత్రమే కాకుండా చాలా వెరిఫికేషన్ ప్రక్రియలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్, ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇకేవైసీ వెరిఫికేషన్, ఇఆధార్ వెరిఫికేషన్, ఆఫ్‌లైన్ పేపర్ బేస్డ్ వెరిఫికేషన్ లాంటి వెరిఫికేషన్ ప్రక్రియలను కూడా తీసుకు వచ్చింది. బయోమెట్రిక్, ఓటీపీ వెరిఫికేషన్స్ వంటివి కూడా తీసుకొచ్చారు.

No comments

Powered by Blogger.