Aadhaar నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా....!!!
ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ఆధార్ ప్రాధికార సంస్థ-ఉడారు(యుఐడిఎఐ)కు చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది.
కేంద్రం ఇచ్చిన అధికారంతో ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను ఉడాయ్ పరిశీలించి గరిష్ఠంగా రూ.కోటి వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. ఫిర్యాదుల పరిశీలనకు న్యాయాధికారులను నియమించుకునే అధికారం ఆ సంస్థకు ఉంటుందని, న్యాయాధికారులు విధించిన జరిమానాలపై అప్పీలు చేసుకోవాలంటే టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్ అప్పీలేట్ అథారిటీగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించిన చట్టాన్ని రెండేళ్ల క్రితమే ఆమోదించగా తాజాగా అందుకు వీలు కల్పించే నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.
No comments