Andhra Pradesh: ఏపీలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు...!!
Andhra Pradesh: బంగాళాఖాతం లో వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వాయుగుండం ఈనెల 29 నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. నవంబర్ 29 వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం మరింత ఉధ్దృతమై తరువాత 48 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
ఈశాన్య భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండడంతో ఇవాళ, రేపు తెలంగాణలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. రూకెతి బంగాళాఖాతంలో తుపాను ప్రభావం వల్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
No comments