Latest

Loading...

AP CM Jagan: ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ..! ఈ విషయంపైనే....!!

AP CM Jagan

 AP CM Jagan: ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి


దాదాపు అయిదు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లకు ఏపి సీఎం వైఎస్ జగన్ వేరువేరుగా లేఖలు రాశారు భారీవర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ, తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి తక్షణం వెయ్యి కోట్ల రూపాయలు సాయం ప్రకటించాలని సీఎం జగన్ విజ్ఞఫ్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.


AP CM Jagan: నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం


రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. చాలా చోట్ల 20 సెంమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రనష్టం వాటిల్లింది అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. 196 మండలాలు నీట మునిగాయానీ, 324 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 69,616 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయనీ, చెరువులకు గండ్లు పడటం వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయానీ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.


భారీ వర్షాలకు దాదాపు 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దాదాపు 40 మంది వరదల కారణంగా చనిపోయారన్నారు. వరద ప్రవాహం వల్ల పలు చోట్ల రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని గుర్తు చేస్తూ.. రెండు హెలికాఫ్టర్ లు, 17 ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి మోడీ ఏపి సీఎం జగన్ కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ సమయంలోనే కేంద్రం నుండి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.



No comments

Powered by Blogger.